జన్నారంలో  బిపి మండల్ జయంతి వేడుకలు..

BP Mandal Jayanti celebrations in Jannaram..నవతెలంగాణ – జన్నారం
బీపీ మండల్ జయంతి వేడుకలను జన్నారం మండల కేంద్రంలోని బీసీ సంఘ కార్యాలయంలో  ఆదివారం బీసీ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా  బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య  మాట్లాడుతూ బిందెశ్వరి ప్రసాద్ మండల్ మాజీ ముఖ్యమంత్రి  బిసి సమస్యల నివేదన కమిషన్ చైర్మన్గా పనిచేసే 42 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి  అందజేసిన మహా నాయకుడు అన్నారు. వారి కృషి వలన నేడు బీసీలకు విద్య ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయన్నారు . బిపి మండల్  నూట ఆరవ జయంతి సందర్భంగా  జన్నారంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య  మంచిర్యాల జిల్లా బీసీ కేయూపిఎస్ కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ  కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్  మాజీ ఎంపీపీ చెట్పల్లి సత్యం  మంచిర్యాల డివిజన్ మోకుదెబ్బ అధ్యక్షుడు ఒళ్లాల నరసగౌడ్ , పొనకల్ పట్టణ మున్నూరు సంఘం కార్యదర్శి దాసరి శ్రీనివాస్ , ముదిరాజ్ మండల సంఘం అధ్యక్షుడు దండెవేణి శ్రీధర్ , బిసి యువ నాయకుడు కొండపల్లి మహేష్  జన్నారం మండలం కుమ్మర సంఘం అధ్యక్షుడు ఎగిడి భూమన్న  దోమకొండ మల్లేష్  కొత్తపల్లి మొగిలి  తదితరులు పాల్గొన్నారు.
Spread the love