నవతెలంగాణ – డిచ్ పల్లి
తల్లిపాలు అమృతంతో సమానమని, ఇప్పుడే పుట్టిన శిశువుకు ఆరోగ్య సంజీవిని ముర్రుపాలని దానిని త్రాగించాలని మండల అరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు.మంగళవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అశా కార్యకర్తల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలందరికీ కొత్త రిజిస్టర్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ రిజిస్టర్లో మొదట మీ పరిధిలో గల కుటుంబల వివరములు, వారి దిన చర్య, అర్హులైన దంపతుల రిజిస్టర్, గర్భిణీ స్త్రీల రిజిస్టర్, బాలింత సంరక్షణ రిజిస్టర్, గృహంలో నవజాత శిశువు రిజిస్టర్, గృహంలో పసిబిడ్డ సంరక్షణ రిజిస్టర్, శిశువులు, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు వివరాలు, ఎస్. ఎన్.సి. యు సెంటర్ కు రిఫర్ చేసిన అనారోగ్య నవజాత శిశువుల వివరాలు, ఎన్ఆర్సిపి రిఫర్ చేసిన శ్యామ్ మామ్ కేసుల వివరాలు,ఆరు నెలల నుండి 60 నెలల పిల్లలకు ఐరన్ టానిక్ సిరప్ మాత్రం ఇచ్చిన వివరాలు, మరణముల వివరాలను నమోదు చేసుకొవాలని సూచించారు.నెలవారి సి డి కేసుల గుర్తింపు చికిత్స ఫాలోప్ వివరములు, డెంగ్యూ కేసుల వివరములు, మలేరియా బోదకాలు కేసుల వివరములు, క్షయ వ్యాధి కేసుల రిజిస్టర్, కుష్టు వ్యాధి కేసుల రిజిస్టర్, పై వివరాలన్నింటినీ ఒకే రిజిస్టర్లో తీసుకువచ్చి వీరికి తెలంగాణ ప్రభుత్వం ఆశా కార్యకర్త దినచర్యల రికార్డుగా కమిషనర్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారిచే ఇవ్వబడిందని వివరించారు. ఈ రిజిస్టర్లు ప్రతి ఒక్క ఆశ కార్యకర్త ప్రతిరోజు తప్పకుండా నిర్వర్తించాలని తెలియజేశారు. ఈనెల అంశం అయిన తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు అమృతంతో సమానమని, శిశువుకు ఆరోగ్య సంజీవని లాంటిదని ప్రసావం జరిగిన వెంటనే ముర్రుపాలు త్రాగించాలని వాటితో రోగనిరోధక శక్తి శిశువుకు పెరుగుతుందని పేర్కొన్నారు.దింతో శిశువుకు పౌష్టికాహారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు దేవపాల, అక్బర్ అలీ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.