మర్పల్లిలో తల్లిపాల వారోత్సవాలు

 Breastfeeding week celebrations in Marpally– సీడీపీఓ కాంతారావు, ఎంఈఓ విద్యాసాగర్‌
నవతెలంగాణ-మర్పల్లి
తల్లిపాలే బిడ్డకు కొండంత బలం పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని సీడీపీఓ కే కాంతారావు, మండల విద్యాధికారి విద్యాసాగర్‌ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలో మహిళా టీచర్లు, కిషోర్‌ బాలికలు, తల్లులు, అంగన్వాడి టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు మూడు నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని తల్లిపాలతోనే బిడ్డకు కొండంత బలం వస్తుందని వారన్నారు. కొందరు బిడ్డకు తల్లి పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు అన్నారు. బిడ్డకు పాలు ఇవ్వడంలోనే తల్లి బిడ్డలు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ రిజ్వానా బేగం, మహిళా టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కిషోర్‌ బాలికలు, మహిళలు పాల్గొన్నారు.

Spread the love