టీఎస్‌ బీపాస్‌కు తూట్లు

ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా
పర్యవేక్షణ లేని నగర ప్రణాళిక విభాగం
కోర్టు ఉత్తర్వులతో చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-బోడుప్పల్‌
బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో నూతన పురపాలక చట్టంలో రూపొందించిన టీఎస్‌ బీపాస్‌ చట్టానికి పూర్తి స్థాయిలో తూట్లు పడుతున్నాయి. కార్పోరేషన్‌ పరిధిలోని సర్వే నెంబరు 63/1, 63/28 నుండి 63/39 వరకు గల ప్రభు త్వ భూమి రోజు రోజుకూ అన్యాక్రాంతం అవుతుంది. నగర ప్రణాళిక విభాగం అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా టీఎస్‌ బీ పాస్‌ ఎక్కడ అమలు కాక పోవడం వలన కార్పో రేషన్‌కు రావాల్సిన ఆదాయం పూర్తి స్థాయిలో తగ్గి పోతుందనేది అందరికీ తెలిసిన సత్యమే.
ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు…
పై సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో రోజు రోజుకూ ఇండ్ల నిర్మాణాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి గురి అవుతుంటే బాధ్యత వహించాల్సిన రెవెన్యూ అధికారులు తమ విధులను సక్ర మంగా నిర్వర్తించకపోవాడంతో కోట్లు విలువ చేసే భూములు దళారుల చేతిలోకి వెళ్ళి పోతుంది.
కోర్టు ఉత్తర్వుల పేరిటా నిర్మాణాలు…
ప్రభుత్వ భూముల్లో చేపట్టే నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుండా కబ్జా దారులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించి తప్పుడు పత్రాలతో రెవెన్యూ అధికారులు అడ్డుకోకుండా ఉత్తర్వులు తెచ్చుకొని నిర్మాణాలు చేపడుతు న్నారు. కానీ సదరు నిర్మాణాలకు టీఎస్‌ బీ పాస్‌ ప్రకారం నిర్మాణ అనుమతులు మాత్రం తీసు కోవడం లేదు. ప్రభుత్వ భూముల కబ్జాపై స్పం దించి చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికా రులు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మేం ఎం చేయలేమని చెప్తున్నారు. అదే సందర్భంలో టీఎస్‌ బీ పాస్‌ ప్రకారం తీసుకోవాల్సిన నిర్మాణపు అనుమతులను పర్యవేక్షించాల్సిన నగర ప్రణాళిక అధికారులు ఆ స్థలం తమది కాదని చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఇరు వర్గాల అధికారులు బాధ్యత వహించి ప్రభుత్వ భూమిని కాపాడుతారా లేదా చూడాలి.

Spread the love