విరిగిన చెట్లు రాలిన మామిడి కాయలు

నవతెలంగాణ – గోవిందరావుపేట: వాన బీభత్సం అంతా ఇంతా కాదు. శనివారం సాయంత్రం వీచిన గాలివానకు మండల వ్యాప్తంగా అనేక చెట్లు నేల వాలాయి. రహదారులు మూసుకుపోయాయి. సుమారు 50 కి పైగా ఇళ్లల్లో పైకప్పులు ఎగిరిపోయాయి. మూడు గ్రామాల్లో ఇండ్లపై చెట్లు కూలిన ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆయా కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. మామిడి కొమ్మలు విరిగిపడగా కాయలు చెట్లకు లేకుండా రాలిపోయాయి. గతంలో కురిసిన అకాల వర్షాలకు కాయలు నాణ్యత దెబ్బతినగా ఈ వర్షానికి కాయలు పూర్తిగా రాలిపోయాయని మామిడి రైతులు తెలుపుతున్నారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ప్రభుత్వం అధికారులు స్పందించి సర్వే నిర్వహించి న్యాయం చేయాలని లేచిపోయిన ఇళ్ల యజమానులు కాయలు రాలిన మామిడి రైతులు పంట నేల వాలిన వరి పొలాల రైతులు కోరుతున్నారు.

Spread the love