బీఆర్‌ఎస్‌ ఆందోళనలు చేయొచ్చు కానీ బీజేపీ చేయొద్దా ?

– బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్‌ రెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్‌
అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలు చేయొచ్చు కానీ బీజేపీ నాయకులు ఆందోళనలు చేయొద్దా అని బీజేపీ సీనియర్‌ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. పోలీసు యంత్రాంగం బీజేపీ నాయకులను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ పట్టణ సీఐ ప్రతాప్‌ లింగంను ఫోన్‌ సంభాషణ ద్వారా ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డబుల్‌ బెడ్రూం ఇండ్ల పర్యటన నేపథ్యంలో షాద్‌ నగర్‌ పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంట్లో ఆయనను స్థానిక ఎస్సై విజరు తదితర పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్‌ రెడ్డి సీఐ ప్రతాప్‌ లింగంకు ఫోన్‌ చేసి మాట్లాడారు. రాజకీయ అణిచివేతలను సహించబో మన్నారు. ఎక్కడా లేని విధంగా బీజేపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని సీఐ దృష్టికి తెసుకెళ్లారు. దీంతో పోలీసు శాఖకు ఎవరిపై ఎలాంటి ప్రత్యేక ఉద్దేశాలు ఉండ వని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతిభద్రతల రక్షణ కోసమే పని చేస్తామని సీఐ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లి శ్రీవర్ధన్‌ రెడ్డి, అందే బాబయ్య, చెట్ల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love