– విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
– 300 మంది లబ్దిదారులకు రూ.3 కోట్ల చెక్కులు అందజేత
నవతెలంగాణ-కందుకూరు
చేతివృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాత మొట్ట మొదటిసారి కందుకూరు మండలానికి వచ్చిన సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో టంకరి రామిరెడ్డి కల్యాణ మండపంలో నియోజక వర్గ స్థాయి బీసీబంధు చెక్కులు పంపిణీ చేశారు. ఇంతకుముందే హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహ దారిపై వీధిలైట్లను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీసీలకు రూ. లక్షా ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతోనే బీసీబంధు పథకం ప్రారంభించినట్టు తెలిపారు. 300 మంది లబ్దిదారులకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్టు వెల్లడించారు. ఆధుని కతతో ఉపాధి కోల్పోయిన కుల,చేతివృత్తుల వారికి అండగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీసీ కుటుంబాలకు రూ.లక్షా అందిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో అందరూ సమానంగా ఎదగాలని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రి యగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయనంద్ గుప్తా, జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితరెడ్డి, స్థానిక జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, కందు కూరు సింగల్ విండో చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మన్నే జయేందర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.