ప్రజల మేలు కోరేది బీఆర్‌ఎస్‌ మాత్రమే ఏ..

– ఈసారి బాజిరెడ్డి గెలుపు తథ్యం..

– ఇంటింటికి విసృతంగా ప్రచారం..
– ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారందరి మేలు కోరేది ఒక బీఆర్‌ఎస్‌ మాత్రమే నని, నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అబిమానులతో కలిసి ఇందల్ వాయి మండలం లోని నల్లవెల్లి గ్రామంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఎంపీపీ భాదవత్ రమేష్ నాయక్, మండల బీఆర్‌ఎస్‌ అద్యక్షులు చిలువెరి దాస్ లా అధ్వర్యంలో మంగళవారం గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఈసారి నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టే పథకాలను ప్రజలకు, మహిళలకు వివరి‌ంచారు. పేదలకు 4వందలకే గ్యాస్ సిలిండర్లతో పాటు పేద, నీరుపేద లను దృష్టి లో పెట్టుకొని సంక్షేమ పథకాలను మెనిఫేస్టోలో ప్రకటించినట్లు వివరించారు. ఎమ్మెల్యె బాజిరెడ్డి గోవర్ధన్ గత పదేళ్లుగా రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. కారు గుర్తుకే ఓటు వేసి రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలి పించాలని వారు కోరారు. ఎ గ్రామం చుసిన కోట్లా రూపాయల మేర పనులను చేయించారని కోన్ని ఏళ్ల పాటు పాలించిన పార్టీలు ప్రజల సంక్షేమం ను, గ్రామ అభివృద్ది కి ఏలాంటి నీదులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మొక్కవోని ధైర్యంతో అబివృద్ధి కి పేద్ద పిట వేసినట్లు మోహన్ తెలిపారు. ఇతర పార్టీల నాయకులు చేప్పే మాటలు విని మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చిలువేరి దాస్, వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, సర్పంచ్ విజయ లక్ష్మి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్ గౌడ్, మహేష్, సాంబార్ విఠల్, సీనియర్ నాయకులు అరటి రఘు, బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love