బీఆర్‌ఎస్‌ అంటే భరోసా, సంక్షేమం

– జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-బూర్గంపాడు
బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవితని భారీ మెజారిటీతో గెలిపించాలని, బీఆర్‌ఎస్‌ అంటేనే భరోసా అని, సంక్షేమ అపర భగీరధుడు మాజీ సీఎం కేసీఆర్‌ అని జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. బుధవారం బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామపంచాయతీలో ఈనెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవితని గెలిపించాలని కోరుతూ జెడ్పీటీసీ శ్రీలత ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవితని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివద్ధి చెందిన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే బ్రష్టు పట్టించిందన్నారు. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటేనని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలం కావడంతో ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మోరంపల్లి బంజర గ్రామ శాఖ అధ్యక్షులు కైపు ఖగేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు చేతుల పెద్ద వీర్రాజు, గంగుల చంద్రశేఖర్‌రెడ్డి, బత్తుల రామ కొండారెడ్డి, కామసాని వెంకటేశ్వర్లు, బండారు సోమయ్య, మాజీ వార్డ్‌ నెంబర్‌లు కామిరెడ్డి పద్మ, మేడం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love