రైతు సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..!

నవతెలంగాణ – హైదరాబాద్
రైతు సమస్యలపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 18న కేబినెట్‌ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ తొలి సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. యాసంగి పంటకాలం మూడు నుంచి నాలుగు వారాలు ముందుకు జరపడం విషయంపై చర్చించారు. పంట కాలాన్ని ముందుకు జరిపితే అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోకుండా కాపాడడం, మార్చి నెలాఖరు వరకు యాసంగి పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యవంతం చేయడం తదితర అంశాలపై మంత్రుల కమిటీ విస్తృతంగా చర్చించింది.

Spread the love