తూర్పులో పోటా పోటీగా ప్రచారాలు

– గెలుపుపై ధీమాలో ఎవరికి వారే…
– హోరెత్తుతున్న ప్రచార శైలీ
– ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్న నేతలు
నవతెలంగాణ-వరంగల్‌
వరంగల్‌ తూర్పు నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున కొండా సురేఖ, బీ ఆర్‌ఎస్‌ పార్టీ నుండి నన్నపునేని నరేందర్‌, బిజెపి పార్టీ నుండి ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు బరిలో దిగుతున్న విషయం విధితమే. తూర్పు నియోజకవర్గంలోనే ప్రజలకు ఎల్లవేళలా అండదం డలను అందించే వారం మేమంటే మేమే అని ఓటర్ల ముంగీటికి నా యకులు వెళ్తున్నారు. ఎట్టకేలకు తూర్పులో ప్రధాన పార్టీల అభ్యర్థుల తమ అభ్యర్థిత్వం పూర్తిగా ఖరారు కావడంతో నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ కార్యకర్తల్లో జోష్‌ అందుకున్నది.ఈ క్రమంలో కొంతమంది కార్పొరేటర్లు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారుతున్న పరిస్థితులు అడప దడపా గోచరిస్తున్నాయి. ప్రధాన రా జకీయ పార్టీలు గడపగడపకు వెళ్లి సమస్యల పరిష్కార దిశకు సహక రిస్తామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వివిధ పార్టీలోని నాయకులు అ నుకూల వర్గీయుల మద్దతు కూడగట్టెందుకు సిద్ధమవుతున్నారు. బీ ఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల వర్గీయులు తమ అనుచరులతో కలి సి అసమ్మతి నాయకులు ఎవరైనా ఉంటే ఆయా నాయకుల దగ్గరకు వెళ్లి కలుస్తూ తమకు అనుకూ లంగా మారల్చుకునేట్లు ప్రయత్నం చే స్తున్నట్లు సమాచారం. సదరు నాయకులు కూడా కొన్ని ఆయా పార్టీల కు అనుకూలంగా మద్దతు ఇచ్చేందుకు ఉత్సాహన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఎలాగైనా వరంగల్‌ తూర్పులో ఎవరికి వారే తమ జెండాను ఎగరవేస్తామని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే వరంగల్‌ తూర్పులో ప్రతి డివిజన్‌లో తమదంటూ ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని వివిధ పార్టీల అభ్యర్థులు కార్య కర్తలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. వివిధ డివిజన్‌ లోని ఓట ర్లు ఎలక్షన్ల తీరును గమనిస్తు ఉండడం విశేషం. ఈసారి తెలంగాణ ఉద్యమకారులు,ప్రజలు తూర్పులో జరుగుతున్న ఎలక్షన్ల వైఖరిని సు నిశితంగా గమనిస్తున్నారు. తూర్పు లోని రాజకీయ ప్రధాన పార్టీలు వ్యూహాలను ప్రతి వ్యూహాలతో తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నా రు. గతం నుండి కొండా సురేఖ గెలుపు బాటలో కొండా మురళి వె న్నంటి ఉంటూ ప్రత్యేక కార్యాచరణతో కాంగ్రెస్‌ కార్యకర్తలను కొండ వ ర్గీయులను మమేకం చేస్తూన్న పరిస్థితులు గోచరిస్తున్నాయి.
అదేవిధంగా బీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థి నన్నపనేని నరేందర్‌ పార్టీ శ్రేణులతో కలిసి గత అనుభవాల దృష్ట్యా తమ అనుకూలమైన వారిని తమ ఓటు బ్యాంకుపోకుండా గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బిజెపి అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు స్వయంగా తాను కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యా చరణ రూపొందించుకొని ఇప్పటికే అన్ని వార్డు లలో ప్రచారాన్ని మొదలు పెట్టారు. తూర్పులోని ప్రధాన పార్టీలన్నీ ఈసారి జరగబోయే ఎలక్షన్లలో ప్రత్యక్షంగా ఓటర్ల దగ్గరికి వెళ్తూ తమ గెలుపును కాయం చేయాలంటూ తమదైన శైలిలో కోరుకుంటున్నారు.దానికి ప్రతిస్పందనగా ఓటర్లు కూడా అనుకూ లంగా ఆసక్తిని కనబరుస్తున్నారు. వచ్చే ఫలితాలలో ఎవరి జెండా తూర్పులో రెపరెపలాడుతుందో వేచి చూడాల్సిందే.

Spread the love