విత్తనాలు ఎరువులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: ఏఈఓ సతీష్

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ లో గురువారం నాడు వ్యవసాయ రైతులకు విత్తనాలు ఎరువులు కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వ్యవసాయ విస్తీర్ణ అధికారి సతీష్ రైతులకు అవగాహన కల్పించారు. రైతులు లూజుగా వున్న విత్తనాలు కొనకూడదు. విత్తనాలు మరియు ఎరువులు వ్యవసాయ శాఖ అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొనాలి, విత్తనాలు తీసుకున్నపుడు రశీదు తప్పకుండా తీసుకొని దానిని పంటకాలం అయ్యేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే ముందు బ్యాగ్ పైన వున్న లాట్ నెంబర్, ఎక్సపెయిరీ డేట్,లేబుల్ గమనించాలి. ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తే వ్యవసాయ శాఖ అధికారికి గానీ, వ్యవసాయ విస్తరణ అధికారి కి గానీ సమాచారం ఇవ్వాలి.అదేవిధంగా వచ్చే వానాకాలం లో సాగు చేసే పంటల గూర్చి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సోదరులు సంగ్రామ్,యాదవ్ రావు, హన్మండ్లు,మష్ణాజి,నన్నేష,సకారం తదితరులు పాల్గొన్నారు.
Spread the love