నసురుల్లాబాద్ చెక్ పోస్ట్ వద్ద నగదు స్వాధీనం

– లక్ష 96వేలు స్వాధీనం
నవతెలంగాణ నసురుల్లాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం సాయంత్రం నసురుల్లాబాద్ గండి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. నసురుల్లాబాద్ పోలీసుల సమాచారం మేరకు ఇందులో నిజామాబాద్ జిల్లా వినాయక నగర్ కు చెందిన వ్యక్తి నుంచి రూ.1, 26,550,  బోధన్ పట్టణానికి చెందిన వ్యక్తి నుండి రూ.70 వేలు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బును నసురుల్లాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, బోధన్ వెళ్లే రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెల్లుతుంటాయి. అక్రమ రవాణా జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో అధికారులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలకు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పెద్దఎత్తున డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ నూతన ఎస్ ఐ లావణ్య, ఏ ఎస్ ఐ లు వెంకట రావు అబిడ్ బేగ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love