– సాక్ష్యాలు నాశనం చేశారంటూ అభియోగాలు
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢకొీన్న ప్రమాదంపై దర్యాప్తు చేసిన సిబిఐ, ముగ్గురు రైల్వే ఉద్యోగులపై చార్జిషీట్ దాఖలు చేసింది. సీనియర్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజినీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూరిత అభియోగాలు మోపింది. ఈ ముగ్గురినీ జూలైలో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీసీలోని 304, 201 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. జూన్ 2న బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢకొీన్న ప్రమాదంలో సుమారు 290 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని రైల్వే శాఖ అనుమానించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సిబిఐ దర్యాప్తు కోరారు.