
నవతెలంగాణ -పెద్దవూర
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఐసీడీఎస్ పథకం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన పోషణ్ అభియాన్ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నమని అనుముల ప్రాజెక్టు ఐసిడిఎస్ అధికారి గంధం పద్మావతి అన్నారు.మంగళవారం పెద్దవూర మండలం లోని చలకుర్తి అంగన్వాడీ కేంద్రం లో పోషణ అభియాన్ పై అవగాహనా కల్పించారు. ఈసందర్బంగా గర్భిణులు, చిన్నారులు తీసుకునే ఆహరంలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి ప్రజలను అవగాహణ కల్పించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు గ్రామంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. స్థానికంగా లభించే ఏ ఆహారంలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలియజేస్తు తీసుకోవల్సిన జాగత్రలు వాటిని కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు. పోషణ పక్షోత్సవాల్లో చైతన్య కార్యక్రమాలు అనుముల ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం లోని 75 కేంద్రాల పరిధిలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ లు పర్యవేక్షించారు. పౌష్టికాహరం ప్రాధాన్యతను తెలిపే ప్రదర్శణలు క్షేత్ర పర్యటను అవగాహణ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రోజుకో కార్యక్రమంలో భాగంగా మార్చి 8న పోషణ మేళా– పోషణ పక్షం, 9న అన్నప్రాసన, సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, 10న పోషణ్ ర్యాలీ, 11న రకతహీణతపై పాఠశాలలో క్యాంపు, కిషోర బాలికలకు అవగాహన, 12న పోషక ఆహారం పై సమావేశం, 13న ఇంటింటి పోషణ పండుగ ప్రతిజ్ఞ, 14న యువజన సంఘాలతో సమావేశం పోషణ నడక, 15న పోషకాహార ప్రదర్శన, 16న రైతు క్లబ్‌ల సమావేశం, అంగడి సంత కార్యక్రమం, 17న ప్రభాత్ ఫెరి పోషణ, 18న యువజన సంఘాల లేదా పాఠశాలల్లో సమావేశం,19న కిచెన్ గార్డెన్‌ల పై క్షేత్ర పర్యటనలు జరిపామన్నారు.20న రక్తహీనతపై కిషోర బాలికల ఆవగాహణ క్యాంపు, 21న పోషణ్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ గౌసియా బేగం, అంగన్వాడీ టీచర్లు శాంతమ్మ, యాదమ్మ,మంగమ్మ, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.