వర్గీకరణ తీర్పుతో సంబరాలు

Celebrate with categorical judgmentనవతెలంగాణ – పెద్దకొడప్ గల్
ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మండల అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటం ఫలించిందని మండల అధ్యక్షులు  అన్నారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని అంబేద్కర్ వద్దఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగా సామాజిక న్యాయాన్ని గ్రహించి ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సామాజిక న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని,ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంతో మంది జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 2005లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను కొట్టివేసిన తర్వాత మళ్లీ ఉద్యమన్ని తీవ్రస్థాయికి తీసుకుపోవడానికి కృషి చేసిన మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు. 2005 ఎస్సీ వర్గీకరణ చెల్లదు అనే తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 6 మంది బెంచ్ న్యాయమూర్తులతో  ఎస్సీలలో ఎస్టీలలో సామాజిక న్యాయం అవసరమని ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఫలితం యావత్తు జాతి సంతోషించవలసిన అవసరం ఉందన్నారు.ఈ విజయాన్ని జాతి ఉద్యమంలో అమరులైన అమరవీరులకు సామాజిక ఉద్యమకారులకు ప్రజాస్వామ్య వాదులకు అంకితం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు ఎస్సీ వర్గీకరణ ఎస్టి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ లను భర్తీ చేయాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love