కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు

నవతెలంగాణ – కంటేశ్వర్
సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ పై ఉన్న పార్లమెంట్ అనర్హత వేటును ఉపాసంహరించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన కారణంగా సోమవారం పార్లమెంటు స్పీకర్ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్దించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచి కాంగ్రెస్ శ్రేణులు హార్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గాంధీ ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ దేశంలోని ప్రజలందరినీ ఏకం చేస్తున్న రాహుల్ గాంధీ  గొంతును నొక్కాలని , అనచివేయాలని పార్లమెంటులో ఆయన ఉండకూడదని చూసిన నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టుల ఉందని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ,రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ పాలన కొనసాగిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీకే కాదు దేశ ప్రజలందరూ న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది అనే నమ్మకం కలిగిందని, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినందుకు సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో పీడిత ప్రజల పక్షాన పోరాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసే విధంగా రాహుల్ గాంధీ  తీసుకున్న సంకల్పం విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ  వైపే దేశం మొత్తం నడుస్తుందని ,రాహుల్ గాంధీ  ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ముందుకు వెళ్తారని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేశ వేణు మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ పై అర్హతను రద్దు చేసిన కారణంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం జరిగిందని, అమ్మవారు నరకాసురుని చంపినప్పుడు భారత ప్రజలు సంబరాలు చేసుకుంటారు అదే విధంగా దేశానికి నరకాసురుల తయారైన నరేంద్ర మోడీ పైన సుప్రీంకోర్టు అమ్మవారిల రాహుల్ గాంధీ గారి అనర్హతను రద్దు చేసిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ  పక్షాన ఎల్లప్పుడూ కాంగ్రెస్ శ్రేణులు ఉంటారని దేశాన్ని ఏకం చేయడానికి దేశంలో అనేక వర్గాలపై జరుగుతున్న అనచివేతను నిర్మూలించడానికి రాహుల్ గాంధీ  ఒక శక్తి లా పనిచేస్తున్నారని, రాహుల్ గాంధీ  గొంతు నొక్కే విధంగా పార్లమెంటులో ఆయన గలాన్ని వినిపించకుండా చేసే విధంగా నరేంద్ర మోడీ చేసిన కుట్రను సుప్రీంకోర్టు అపేసిందని, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి కాంగ్రెస్ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని కేశ వేణు అన్నారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హాందన్ మాట్లాడుతూ.. అంబేద్కర్  రచించిన ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదని, నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ని ప్రజాస్వామ్య విరుద్ధంగా పార్లమెంట్ నుండి పంపిస్తే దేశాన్ని ఎలచ్చని, అందుకే రాహుల్ గాంధీ పై మోడీ కుట్రను తిప్పి కొట్టే విధంగా సుప్రీంకోర్టు అనర్హత వేటుపై స్టే విధించిందని ,ఇది ప్రజాస్వామ్యపై అందరికీ నమ్మకం కలిగిందని ,రాహుల్ గాంధీ కి విజయం సాధించే దిశగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏ కార్యక్రమమైన విజయవంతంగా పూర్తి చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసిన కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్, రోహిత్ ,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవదల్ అధ్యక్షులు సంతోష్ ,బొబ్బిలి రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, సిరికొండ గంగారెడ్డి ,అబ్దుల్ ఎజాజ్, వినయ్ ,ప్రీతం ,శోభన్ ,ప్రసాద్ శుభం  తదితరులు పాల్గొన్నారు.
Spread the love