నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర హౌంశాఖమంత్రి పరిశోధనా ప్రతిభ పతకాలు 2023 సంవత్సరానికి గాను రాష్ట్రం నుంచి ఐదుగురు పోలీసులు అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో అత్యున్నతమైన వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, పరిశోధనలో చూపిన ప్రతిభను గుర్తించేందుకుగానూ కేంద్ర హౌం శాఖ ఈ పతకాలను 2018లో ప్రవేశపెట్టింది. ప్రతి ఏటా ఆగస్టు 12న ప్రకటిస్తారు. వివిధ రాష్ట్రాల్లోని పోలీసు అధికారులతో పాటు సీబీఐ, ఎస్‌ఐఏతో కలిపి 140 మందికి పతకాలు ప్రకటించారు. ఈ ఏడాదికి తెలంగాణ నుంచి మూల జితేందర్ రెడ్డి (అసిస్టెంట్ సీపీ), భూపతి శ్రీనివాసరావు (అసిస్టెంట్ సీపీ), మేకల తిరుపతన్న (అదనపు ఎస్పీ), రాజుల సత్యనారాయణ రాజు (డిప్యూటీ ఎస్పీ, కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్ కుమార్ (డిప్యూటీ ఎస్పీ)లు ఎంపికయ్యారు.