మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ నివాళి

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఈ మేరకు శనివారం రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా తెలిపారు.

Spread the love