బైక్‌ మెకానిక్‌గా రాహుల్‌

–  ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో టూవీలర్‌కు మరమ్మతులు
న్యూఢిల్లీ : భారత్‌ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లారీలలో ప్రయాణిస్తూ ..డ్రెవర్ల కషాలు,బాధలు వింటున్నారు. తాజాగా ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్‌ మెకానిక్‌ షాపులను సందర్శించారు. అక్కడి కార్మికులతో ముచ్చటించిన రాహుల్‌.. వారితో కలిసి కొన్ని బైక్‌లను రిపేర్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న బైక్‌ గురించీ ప్రస్తావించిన రాహుల్‌.. దాన్ని ఎందుకు బయటకు తీయరో వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో రాహుల్‌ గాంధీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు.
‘నా దగ్గర కేటీఎం 390 బైక్‌ ఉంది. కానీ, దాన్ని నేను వినియోగించను. దాన్ని నడిపేందుకు నా భద్రతా సిబ్బంది అనుమతించరు. మీ సమస్యలను తెలుసుకునేందుకు నేను ఇక్కడకు వచ్చాను’ అని మెకానిక్‌లతో రాహుల్‌ గాంధీ చెప్పారు. మీ పెండ్లి ఎప్పుడు జరుగుతుంది..? అని మెకానిక్‌లు అడిగిన ప్రశ్నలకు మాత్రం రాహుల్‌ చిరునవ్వే సమాధానమైంది.

Spread the love