చక్రన్న రైతు భరోసా

నవతెలంగాణ – సిద్దిపేట
చక్రన్న రైతు భరోసా పేరిట చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం,  ప్రమాద భీమా, పాడి పరిశ్రమ రైతులకు భరోసా నింపేలా పశుసంరక్షణ భీమా సౌకర్యం తనను గెలిపిస్తే కల్పిస్తానని సిద్దిపేట బి ఎస్ పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. నియోజకవర్గం లోని వివిధ మండలాలతో పాటు పట్టణంలో ఏనుగు గుర్తుకే ఓటేసి తనను గెలిపించాలని  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రజాకార్ల పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి 1 లక్ష రూపాయల నగదు 4 విడతల వారిగా, 25,000/- రూపాయల లోపు పంట ఋణం ఉన్న వారికి పూర్తిగా ఋణమాఫీ విడతల వారిగా చేస్తానని,  గతంలో ఇచ్చిన విధంగా గౌడ భీమా తరహాలో అన్ని కుల వృత్తుల వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love