– మరమ్మతు పనులకు రూ.10.21 కోట్ల నిధులు మంజూరు
– ఏడాది గడిచిన 50శాతం పూర్తికాని పనులు
– కాఫ్ హాలిడే ప్రకటించిన పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్
– చలివాగు మరమ్మతు పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే ఫైర్
– పనులు చేయకుంటే కాంట్రాక్టర్‌ను మార్చాలని ఎమ్మెల్యే ఆదేశం
నవతెలంగాణ-శాయంపేట
రబీ, ఖరీఫ్ సీజన్లలో రెండు పంటలకు సాగునీరు అం దించే మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు రైతులకు వరప్రదా యనిగా నిలుస్తోంది.60వసంతాలు పూర్తిచేసుకున్న చలివా గు ప్రాజెక్టు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మరమ్మతులకు నోచుకో లేదు. ఫలితంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపో వడంతో రైతులుపంటలకు దూరమవుతున్నారు. 1964లో నిర్మాణమైన ప్రాజెక్టు అప్పటినుండి ఇప్పటి వరకు ప్రతీ సీజ న్‌కు ఆయకట్టు రైతులు రెండు పంటలు పండిస్తూ వ్యవసా య రంగంలో ముందుకు పోతున్నారు. ప్రాజెక్టుకు ప్రధాన కాలువతోపాటు కుడి, ఎడమకాలువలపై రైతులు ఆధారప డి వ్యవసాయం చేసున్నారు. ప్రధానకాలువ ఆయకట్టు 124 ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉండగా, కుడికాలువ ఆయకట్టు 285 ఎకరాలు, ఎడమకాలువ ఆయ కట్టు 737 ఎకరాలు మొత్తం 3,065 ఎకరాలకు అధికారి కంగా సాగునీరు అందు తుండగా, అనధికారికంగా 2,000 ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. ఈ క్రమంలో ప్రాజె క్టు గత పదేళ్ల నుండి మరమ్మతులకు నోచుకోక ప్రాజెక్టు క ట్టపై పిచ్చి మొక్కలు, తుమ్మలు మొలిచి కట్టపై నడవలేని స్థితికి చేరుకుంది. ప్రధాన కాలువతో పాటు కుడి, ఎడమ కాలువలో పిచ్చిమొక్కలు మొలసి చివరాయకట్టుకు సాగు నీరందక గత ఖరీఫ్ పంటలకు దూరమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలివాగు ప్రాజెక్టు మరమ్మతు లకు గత ప్రభుత్వం రూ.10.20 కోట్లు మరమ్మతుల కోసం మంజూరు చేసింది.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గత ఏడాది జులై 9న పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. శిలాఫ లకం వేసి ఏడాది గడిచినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహి స్తుండంతో ఇప్పటివరకు 50శాతం పనులు పూర్తికాలేదని నీ టిపారుదలశాఖ అధికారులు తెలుపుతున్నారు.
ప్రాజెక్టులోకి 7 మండలాల వరద నీరు …
చలివాగు ప్రాజెక్టులో ప్రతి వర్షాకాలం శాయంపేట చు ట్టుపక్కల ఉన్న 7మండలాలు ఆత్మకూర్, దుగ్గొండి, నల్లబె ల్లి, గీసుకొండ, వరంగల్, దామెర, మల్లంపల్లి మండలాలకు సంబంధించిన వరదనీరు ప్రాజెక్టులో చేరి ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తుంది. దీనికితోడు దేవాదుల ఎత్తిపోతల ప థకం ద్వారా భీమ్ ఘన్పూర్ చెరువు నుంచి 40 కిలోమీట ర్ల దూరంలో ఉన్న చలివాగు ప్రాజెక్టుకు 7 క్యూసెక్స్ నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మసాగర్ లిఫ్టుకు అదే 7 క్యూసెక్స్ నీటిని నిరంతరం పంపింగ్ చేసి పంపుతున్నారు. చలివాగు ప్రాజెక్టు నీటిని పరకాల, శాయంపేట మండలాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీటిని, ఆయకట్టు రైతులకు సాగునీటికి అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
క్రాప్ హాలిడే ప్రకటించిన పూర్తికాని పనులు …
చలివాగు ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వ లైనింగ్, కట్ట , మత్తడి, తూముల మరమ్మత్తు, జంగిల్ కటింగ్, తదితర పనుల కోసం 10 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు కాగా, అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంక టర మణారెడ్డి గత ఏ డాది జూలై 9న పనులు చేపట్ట డానికి శంకు స్థాప న చేశారు. టెం డర్ ప్రక్రియ పూర్త యినప్పటికీ, శిలా ఫలకం వేసి ఆరు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
గత ఏడాది నవంబర్‌నెలలో చలివాగు ప్రాజెక్టు శిఖం లో ఆయకట్టు రైతులు అందరూ నీటిపారుదల శాఖ అధికా రుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకొని పనుల మర మ్మతుకోసం క్రాఫ్ హాలిడే ప్రకటించుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ జంగిల్ కటింగ్, కట్ట మరమ్మతు, కొంతమేరకు సిమెంట్ లైనింగ్‌పనులు, కొన్ని తూముల మరమ్మత్తు పను లు చేసే అర్ధాంతరంగా వదిలీ వేశారు. క్రాప్ హాలిడే తో రై తులు నష్టపోయిన కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపో వడంతో రైతులు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. తూము నిర్మా ణం కూడా అధికారుల నిర్లక్ష్యంతో నాసిరకంగా చేశారని ఆ రోపిస్తున్నారు.
రెండుసార్లు ప్రధాన కాల్వకు గండి …
చలివాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కొప్పుల బ్రిడ్జి పక్కన గత ఏడాది అక్టోబర్ 30న కాలువకు గండిపడగా అధికారులు తాత్కాలికంగా మట్టితో పూడ్చివేశారు. మరల కాలువ గుండా సాగునీరు సరఫరా చేయడంతో నవంబర్ 2న గండి పడింది. అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తు చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ కాల్వకు గండి పడిన ప్రదేశంలో శాశ్వత మరమత్తు పనులు చేశారు.
పనులు పూర్తి కాకపోవడంతో ఎమ్మెల్యే ఫైర్ ..
చలివాగు ప్రాజెక్టులో 18 ఫీట్లకు నీటిమట్టం చేరి అలు గు పోస్తుండడంతో, వానకాలం పంటకు సాగునీరు అందిం చేందుకు ఈనెల 22న నీటిపారుదల శాఖ అధికారులు నీటి విడుదల కార్యక్రమం చేపట్టగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పాల్గొని తూము ద్వారా నీటి విడుదల చేశారు. సంబంధిత అధికారులకు ప్రాజెక్టు మరమత్తు పనులపై చ ర్చించారు. ఇంకా పనులు చేయాల్సి ఉన్నాయని కాంట్రాక్ట్ అందుబాటులో ఉండడం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. నిధులు దుర్వినియోగం కాకుండా కాంట్రాక్టర్ను మార్చివేయాలని ఆదేశించారు. మరమ్మత్తు పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొ దటి పంట పూర్తయ్యాక అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మిగులు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అగ్రిమెంట్ అధికారులు డెసిషన్ తీసుకోవాలి : గిరిధర్, ఐబీ డిఈ
చలివాగు ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం గత ప్రభుత్వం 10.21 కోట్ల నిధులను విడుదల చేసింది. రైతులు మరమ్మత్తు కోసం క్రాఫ్ట్ హాలిడే ప్రకటించగా, జంగిల్ కటింగ్, కొద్దిగా మేరకు సిమెంటు లైనింగ్, తూము రిపేరు లాంటి పనులు పూర్తయ్యాయి. ఇంకా 50% పనులు పూర్తి కావాల్సి ఉంది. మొదటి పంట పూర్తయ్యాక అక్టోబర్ నుండి పనులు చేయిస్తాం. ప్రస్తుతం చివరాయకట్టు వరకు సాగునీరందేలా చర్యలు తీసుకుంటున్నాము. సంబంధిత కాంట్రాక్టర్లపై అగ్రిమెంట్ అధికారులు డెసిషన్ తీసుకోవాలి.