దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు

నవతెలంగాణ-సంగారెడ్డి
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు సంగారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ నాగభూషణం తల్లిదండ్రుల జ్ఞాప కార్థం మంజీర నగర్‌ మెయిన్‌ రోడ్‌ లోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎండలు విపరీతంగా కొడుతుండడంతో.. వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేం ద్రంతో ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందించడం అభి నందనీయమన్నారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ.. వేసవిని దష్టిలో ఉంచుకొని చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలన్నారు. చల్లివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం, పట్టణ ప్రధాన కార్యదర్శి చేర్యాల ఆంజనేయులు, గౌరవ అధ్యక్షుడు ల‌క్ష్మ‌య్య‌, మురహరి, కోశాధికారి సత్తయ్య, విష్ణు, వీరేశం, యాద గిరి, వీరన్న సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Spread the love