పస్తుల్లో.. పంచాయతీ కార్మికులు

– 8 నెలలుగా జీతాల్లేవు
– రాత్రింబవళ్లు చాకిరీ చేయిస్తున్న వైనం
– కార్మికుల్ని పట్టించుకోని గత, ప్రస్తుత ప్రభుత్వం
– ప్రభుత్వోద్యోగులకు 1న జీతాలు.. కార్మికులకు పస్తులు
– ఇచ్చే అరకొర జీతం నెలనెలా ఇయ్యకపోతే బతికేదెట్ల
– ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 5 వేల మంది జీపీ కార్మికులు
– వెట్టి చేయిస్తూ జీతాలివ్వని ప్రభుత్వం : నర్సమ్మ, సీఐటీయూ జిల్లా కోశాధికారి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 1516 గ్రామ పంచా యతీలున్నాయి. వీటిల్లో ఐదు వేల మంది పంచాయతీ కార్మి కులున్నారు. రికార్డుల్లో నమోదైన వాళ్లతో పాటు స్థానిక అవసరాల రిత్య ఒప్పందంపై పనిచేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. ప్రభుత్వం గుర్తించిన కార్మికులకు నెలకు రూ.850 వేతనమిస్తారు. మెదక్‌ జిల్లాలో 469 పంచాయతీల్లో మంది, సంగారెడ్డి జిల్లాలో 647 సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో అనేక గ్రామ పంచాయతీలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వచ్చ అవార్డులు పొందారు. ఆవార్డుల రావడానికి పంచాయతీ కార్మికుల శ్ర‌మ‌ ఫలితం తప్ప మరోటి కాదు. సిద్దిపేట, సంగారెడ్డి‌, మెదక్‌ మూడు జిల్లాల్లోనూ మెజర్‌, మైనర్‌ గ్రామ పంచా యతీలు న్నాయి. చాలా గ్రామ పంచాయతీల్లో అవస రాలను బట్టి కార్మికుల్లేకపోవడం, వీఆర్‌ఎలు లేకపోవడంతో వాళ్లు చేసే పనులు చేయడం, ప్రభుత్వ స్కూల్స్‌లోనూ జీపీ కార్మికు లే ప నిచేయాల్సి రావడంతో తీవ్రమైన పనిభారాన్ని మోస్తున్నారు.
6-9 నెళ్లుగా జీతాలివ్వని ప్రభుత్వం..
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 6-8 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలియ్యట్లేదు. మెదక్‌ జిల్లాలో 8 నెళ్లుగా జీతాలు రావట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కొన్ని పంచాయతీల్లో 6 నెళ్లుగా జీతాలివ్వ లేదంటున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ 6 నెలలకు పైగానే జీతాలివ్వని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన్నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలేస్తుంది. జీపీ కార్మికులకు మాత్రం జీతాలివ్వట్లేదు. ఆయా గ్రామ పంచాయతీల పాలక వర్గాల దయాదక్షన్యాల ఆధారంగా కర్మికులకు జీతాలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నందున కార్మికుల జీతాల గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామ పంచాయతీల్లో ప్రతి పనినీ కార్మికులే చేయాల్సి వస్తుంది. గ్రామ వెట్టి చేయిస్తున్న ప్రభుత్వం పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. మురుగు కాల్వలు, రోడ్లు, వీధుల్ని శుభ్రం చేయాలి. చెత్త చెదారాన్ని ఎత్తిపోయాలి. చెట్ల పొదలు తొలగించాలి. రోడ్ల గుంతలు పడి మురికి నీళ్లు నిల్వ ఉంటే మట్టిపోయలి. మురికి కాల్వలు, నీటి గుంతల్లో దోమలు, ఈగలు వాలకుండా బ్లీచింగ్‌ చల్లాలి. గ్రామానికి అవసరమైన నీటిని సరఫరా చేయాలి. రాత్రివేళ్లల్లో బోర్లు నడిపి ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు నింపి ఊరంతటికీ సరఫరా అయ్యేలా చూడాలి. పెళ్లిళ్లు, శుభ, అశుభ కార్యాలకు నీటిని అందించడమే కాకుండా ఆ చెత్తనంతా కార్మికులే ఎత్తి‌పోయాలి. వీధిలైట్లు వేయడం, నీటి పన్ను, ఇంటిపన్నులు వసూలు చేయడం, ట్రాక్టర్‌ నడపడం, కుక్కలు ఇతర జీవాల శవాల్ని తీసుకెళ్లి పూడ్చడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉం చాలి. హరితహారంలో నాటిన మొక్కల్ని సంరక్షించాలి. ఉపా ధి పనుల్ని గుర్తించి పనులు చేయించాలి. జనన, మర ణ దృవీకరణలు, రెవెన్యూ ఇతర శాఖల పనుల్ని కూడా వీళ్లే చేయాలి. పోలియో, ఓటరు జాబితాల తయారీ, ఓట్ల స్లిప్‌ల పంపిణీ, స్కూల్స్‌ శుభ్రం చేయడం చేయాలి. వీఆర్‌ఎలు గ్రామంలో వివిద సర్టిఫికెట్ల జారీకి దృవీకరించడం, భూ ము ల క్రయవిక్రయాల్లో దృవీకరించడం చెర్వులు, కాల్వలు ప‌నులు చూసేవాళ్లు. ప్రస్తుతం వాళ్లంతా పదోన్నతులపై పోవ‌డంతో ఆ పనుల్ని కూడ జీపీ కార్మికులతోనే చేయిస్తున్నారు.

పంచాయతీ కార్మికుల పట్ల సర్కార్‌ వివక్ష
ఉద్యోగులకు నెలలో ఒకటో తేదీన్నే జీతాలిస్తున్న సర్కా ర్‌ జీపీ కార్మికులకు మాత్రం నెలల తరబడి ఇవకుండా వివక్ష చూపుతుంది. పంచాయతీల్లో ప్రతి పనినీ కార్మికులే చేయాలి. రాత్రింబవళ్లూ అందుబాటులో ఉండి పనిచే యాలి. పండుగలు, కార్యాలకు కూడా వాళ్లే పనులు చేయా ల్సి వస్తుంది. పని భారం పెరుగుతుంది తప్ప జీతాలు పెంచ ట్లేదు. కనీసం ఇచ్చే కొంతనైనా నెల నెలా ఇవ్వడం లేదు. పంచాయతీ కార్మికులకు జీతాలు పెంచాలి. నెల నెల చెల్లించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమన్ని తీవ్రతరం చేయాల్సి వస్తది.
– నర్సమ్మ, సీఐటీయూ జిల్లా కోశాధికారి, మెదక్‌

Spread the love