ఛలో ఉస్మానియా కార్యక్రమం విజయవంతం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఛలోఉస్మానియా కార్యక్రమం విజయవంతంగాముగిసిందని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ పి దత్త హరి తెలిపారు.ఈసందర్బంగా అయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ లలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలని సీఎం సంతకం పెట్టారని, కానీ సీఎం ఆఫీసులో ఒక ఉన్నతాధికారి ఆ ఫైల్ ని పైకి రకుండా అక్కడే ఆపుతున్నారని మండి పడ్డారు. ఒక అధికారి ఇలా చేసినట్లు తమకు సమాచారం అందిందని, కాబట్టి ఆ అధికారులు మా 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లను ఎట్టి పరిస్థితుల్లో మేము నిద్రపోము ఆ అధికారులను నిదుర పోనీయ్యమని హెచ్చరించారు. రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు మేము కమిట్మెంట్ ఐ ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమం చేస్తుంటే ఉన్నత స్థానం లో ఉన్న అ అధికారి మా రెగ్యులరైజ్ ఫైల్ ని ఆపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ అధికారి అసలు రంగు బయట పేడ్తమని మపై కనికరం చుపి ఇచ్చిన మాట కు సిఎం కెసిఆర్ సంతకం పేట్టిన మాపట్ల సానుభూతి చుపక తోకకి పేట్టడం వేపుకు మతలబు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. 12 యూనివర్సిటీలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్ లు ఒక నిర్ణయం తీసుకున్నారని, మా రెగ్యులరైజ్ అయ్యేవరకు పోరాటం కంటిన్యూగా కోని సాగిస్తామని హెచ్చరించారు. ఇది ఉస్మానియా జాక్ రథసారథి డాక్టర్ పరశురాం, జాక్ కన్వీనర్ డాక్టర్ కరుణాకర్, కాకతీయ యూనివర్సిటీ 12 యూనివర్సిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశామని చెప్పారు. రెగ్యులరైజ్ అయ్యేవరకు మేము నిద్రపోమని సామరస్యంగా ప్రభుత్వం స్పందించి 12 యూనివర్సిటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి వివరించారు.చలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమం విజయవంతం అయినందుకు భారీ ఎత్తున జనం వచ్చినందుకు ప్రతి కాంట్రాక్ట్ ప్రొఫెసర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నమని దత్తాహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంగ కిషన్, జాక్ కన్వీనర్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ నారాయణ గుప్తా, జాక్ కన్వీనర్ డాక్టర్ గోపిరాజు, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ డానియల్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సురేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love