5వ కక్ష్యలోకి చంద్రయాన్‌-3

– భూమి చుట్టూ తిరిగే చివరి రౌండ్‌
– ఆగస్టు1న చంద్రుని దిశగా ప్రయాణం
తిరుపతి : ఇస్రో ఈ నెల 14వ తేదీ ప్రయోగించిన చంద్రయాన్‌-3 భూమి చుట్టూ తిరిగే ప్రక్రియలో భాగంగా నాలుగో కక్ష్యను పూర్తి చేసుకొని భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఐదవ కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్‌-3 ముందుగా భూమి చుట్టూ ఐదు రౌండ్లు తిరిగిన తర్వాత తన ప్రయాణాన్ని చంద్రుని వైపుకు మళ్ళిస్తుంది. భూమి చుట్టూ తిరిగే చివరి రౌండును ఆగస్టు 1 రాత్రి 12 గంటలకు పూర్తి చేసుకొని తదుపరి చంద్రుని వైపుకు వెళ్లే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్‌-3 చివరి రౌండ్‌ భూమికి దగ్గరగా 236 కిలోమీటర్లు భూమికి దూరపు కక్ష్య 1,27,609 కిలోమీటర్లు తిరిగిన అనంతరం చంద్ర కక్ష్య వైపుగా ప్రయాణం మొదలు పెడుతుంది.

Spread the love