పవన్‌తో పంచకర్ల భేటీ

–  20న జనసేనలో చేరిక
అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ను విశాఖజిల్లా వైసిపి మాజీ అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం కలిశారు. ఈనెల 20న మంగళగిరిలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లు పంచకర్ల ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కలిసిన అనంతరం పంచకర్ల రమేష్‌బాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సుకోసం పవన్‌కల్యాణ్‌ పడుతున్న తపన చూసి జనసేన పార్టీ కోసం ఒక సైనికునిలా పనిచేయాలని నిర్ణయించుకు న్నానని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని పేర్కొన్నారు. తాజా రాజకీయ పరిణామాలను నాదెండ్ల మనోహర్‌తో చర్చించారు.

Spread the love