రథోత్సవాల కోసం సోమవారం సంత మార్పు

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు ఈనెల 23 24 తేదీలలో జరగనున్నాయి. రథోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వారసంతను మార్పు చేశారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవాల సందర్భంగా వారసంతను మార్పు చేస్తారు. ప్రతి వారం సంత గాంధీ చౌక్ నుండి మార్వాడి గల్లీ పాత బస్టాండు మెన్ రోడ్డు గుండా సంత వ్యాపారాలు కొనసాగే కానీ సోమవారం నాడు రథోత్సవాలను పురస్కరించుకొని సంత సంతోష్ మాత గల్లి దళితవాడ శివాజీ చౌక్ మేన్ రహదారి గుండా నిర్వహించారు. సంత మార్పు పెట్టడం మూలంగా మద్నూర్ మండల కేంద్రంలో రథోత్సవాల గురించి మండల ప్రజలకు తెలియజేయడానికి ఈ విధంగా నిర్వహించారు. సంత మార్పుతో మండల కేంద్ర ప్రజలకు మండల ప్రజలకు రథోత్సవాల గురించి చర్చలు జరిగాయి.
Spread the love