నవనాథపురం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గా చరణ్ గౌడ్

నవతెలంగాణ -ఆర్మూర్
నవనాథపురం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా చరణ్ గౌడ్ కోశాధికారిగా లిక్కి శ్రావణ్ ఎన్నికయ్యారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్ ఆధ్వర్యంలో రెండు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పదవికి చరణ్ గౌడ్, వంశీ, రాజేందర్ లు పోటీ పడగా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో చరణ్ గౌడ్ గెలుపొందారు. కోశాధికారి పదవికి లిక్కి శ్రావణ్, వినోద్ కుమార్ లు పోటీ పడగా బ్యాలెట్ పద్ధతిలో లిక్కి శ్రావణ్ గెలుపొందాడు. గెలుపొందిన చరణ్ గౌడ్, శ్రావణ్ లను పూలమాలలతో సన్మానించి, మిఠాయిలు తినిపించారు. గెలుపొందిన విజేతలకు ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందించారు. వరుస క్రమంలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించిన సభ్యులందరికీ గౌరవ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సంజీవ్, సలహాదారులు గణేష్ గౌడ్, సభ్యులు నరేందర్, విన్సెంట్, అమృత శ్రావణ్ గోలి పురుషోత్తం, గోజూరు మహిపాల్, సూరిబాబు, వినోద్ కుమార్, వెంకటేష్ గుప్తా, వంశీ, దినేష్, సామ సురేష్, తమ్మి వినోద్, రాజేందర్, గటడి అరుణ్, షికారి శ్రీనివాస్, ముఖేష్, రమణయ్య, రాంపూర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love