Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐతో ఫ్రాడ్‌ క్లెయిమ్‌లకు చెక్‌

ఏఐతో ఫ్రాడ్‌ క్లెయిమ్‌లకు చెక్‌

- Advertisement -

రూ.250 కోట్ల పెట్టుబడులు : స్టార్‌ హెల్త్‌ సీఈవో ఆనంద్‌ రారు వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్‌
ఆరోగ్య బీమా రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ), మెషిన్‌ లెర్నింగ్‌ రంగాల్లో ఏటా రూ.250 కోట్ల భారీ పెట్టుబడులను పెడుతోన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్టార్‌ హెల్త్‌ ఎండీ, సీఈవో ఆనంద్‌ రారు మాట్లాడు తూ ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా బీమా రంగంలో ప్రధాన సవాలుగా మారిన నకిలీ క్లెయిమ్‌లను, ఫ్రాడ్‌ కేసుల ను సమర్థవంతంగా అరికడుతు న్నామని వెల్లడించారు. క్లెయిమ్‌ల పరిశీలనలో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఎఐ ఆధారిత డేటా విశ్లేషణను వాడటం ద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా నిజమైన కస్టమర్లకు క్లెయిమ్‌ సెటిల్‌ మెంట్‌ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో ఆరోగ్య బీమా పట్ల ప్రజల్లో అవగాహన గణనీ యంగా పెరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే క్లెయిమ్‌ల చెల్లింపులు ఇక్కడ 24 శాతం వృద్ధి చెందడమే ఇందుకు నిదర్శన మని ఆనంద్‌ రారు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరం ఈ ప్రాంతంలో సుమారు 1.8 లక్షల క్లెయిమ్‌ల కోసం రూ. 1,254 కోట్లు పంపిణీ చేశామ న్నారు. ఇప్పటి వరకు 9.6 లక్షల ప్రాణా లను నిలిపామన్నారు. ప్రస్తుతం తమ సంస్థ 92 శాతం క్లెయిమ్‌లను కేవలం మూడు గంటల్లోపే పరిష్కరిస్తోందన్నా రు. దేశవ్యాప్తంగా ఉన్న 15,000కు పైగా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల దన్నుతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన వివరించారు. తెలుగు రాష్రాల్లో 1800 హాస్పిటల్స్‌తో నెట్‌వర్క్‌ కలిగి ఉన్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -