Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకోర్టు ధిక్కరణ కేసులోహైకోర్టు విచారణకు సీఎస్‌

కోర్టు ధిక్కరణ కేసులోహైకోర్టు విచారణకు సీఎస్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం హైకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శాఖలో ఇంక్రిమెంట్లతోపాటు కనీస వేతనాన్ని చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయలేదంటూ నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు స్వీపర్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుగోపాల్‌ విచారించారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేసినట్టు రామకృష్ణారావు తరపున ప్రభుత్వ న్యాయవాది అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో పిటిషన్‌ పై హైకోర్టు విచారణను ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -