Wednesday, September 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

- Advertisement -

నవతెలంగాణ-బజార్ హత్నూర్
మండలంలోని భోస్రా గ్రామానికి చెందిన రోహిణి (25) శుక్రవారం మధ్యాహ్నం ప్రసవ వేదనలు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2:23 గంటలకు కాల్ అందుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో దిగ్నూర్ సమీపంలో మధ్యాహ్నం 3:18 గంటలకు సురక్షితంగా ఆడ శిశువు జన్మించింది.

అంబులెన్స్‌లోనే వైద్య ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రతా జాగ్రత్తలు పాటిస్తూ ప్రసవం నిర్వహించారు. శిశువు జన్మించిన వెంటనే శ్వాసనాళాన్ని శుభ్రపరిచి, శరీరాన్ని తుడిచి వెచ్చగా ఉంచి అవసరమైన నవజాత శిశు సంరక్షణ అందించారు. శిశువుకు ఆఫర్ స్కోర్ 10 నమోదై, ఆరోగ్యంగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. అనంతరం బొడ్డు తాడును కత్తిరించి, ప్లాసెంటా బయటకు వచ్చిన తర్వాత తల్లి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉండటంతో వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సురక్షితంగా తరలించి వైద్యులకు అప్పగించారు. ఈ సేవలో ఈఆర్సిపి డాక్టర్ వినయ్, ఈఏంటి బి. సురేష్, పైలట్ రాజారాం సమయస్ఫూర్తితో స్పందించి తల్లీబిడ్డలను సురక్షితంగా కాపాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -