మూసారాంబాగ్‌ బ్రిడ్జి మూసివేత..

నవతెలంగాణ  -హైదరాబాద్‌:  నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తెలిపారు.

Spread the love