రేషన్ తీసుకునేవారికి సీఎం రేవంత్ గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు, తక్కువ ధరకు పంపిణీ చేస్తామన్నారు.  చిట్ చాట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయని, రేపటినుండి పరిపాలన సంక్షేమం పైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు.  రైతులు, విద్యార్థులు,త్రాగు సాగు నీరు వీటిపైనే దృష్టి పెడతానన్నారు.  రైతురుణ మాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు.  రైతులను ఒకేసారి రుణవిముక్తులను చేస్తామని స్పష్టం చేశారు.
Spread the love