బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్ : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు.

Spread the love