పెద్దపల్లి లైంగిక దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుసగా హత్యలు, రేప్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై ఎట్టకేలకు స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లి లైంగిక దాడి ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌…. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డిజిపికి ఆదేశాలు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేపు ఘటనపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిజిపికి ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్‌… నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. నారాయణపేట ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై ఆరా తీసిన సీఎం రేవంత్‌…. పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డిజిపికి ఆదేశాలు ఇచ్చారు.ఉట్కూరులో వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇన్ని ఉదంతాల మీద విచారణకు ఆదేశించారు కానీ అయ్యప్ప సొసైటీలో తన సోదరుడు తిరుపతి రెడ్డి మనుషులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మీద దాడి చేసిన ఘటన మీద విచారణకు అదేశించలేదని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.

Spread the love