Tuesday, September 15, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి జీఎం ఆఫీస్‌లో 'సీఎంపీఎఫ్' త్రైపాక్షిక సమావేశం

సత్తుపల్లి జీఎం ఆఫీస్‌లో ‘సీఎంపీఎఫ్’ త్రైపాక్షిక సమావేశం

- Advertisement -

– పెన్షన్ అదాలత్ నిర్వహణ 
నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి ఏరియాలోని జీఎం కార్యాలయంలో సీఎంపీఎఫ్ త్రైపాక్షిక సమావేశం, పెన్షన్ అదాలత్ కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంపీఎఫ్ కమిషనర్లు వంశీధర్, కనకమ్మ పాల్గొన్నారు. వారితో పాటు సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సీఎంపీఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి సులోచన, పలువురు వెల్ఫేర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఉద్యోగులు తమకున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు తెలిపిన సమస్యలపై సీఎంపీఎఫ్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆయా సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారుల బృందం హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో ఎస్‌ఓ టూ జీఎం శ్రీనివాస్, కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సునీల్ వర్మ, జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్, బి. రాజేశ్వరరావు, మురళి, వివిధ విభాలకు చెందిన అధికారులు రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -