నగరాన్ని పులుమున్న
సమావేశాలలో సక్కగా సూపుడు కాదు..
బుగులు లేని బతుకు కావాలి..
నగంగా దేశాన్ని బజారున బెట్టిన
మౌనం దేనికి సంకేతం..
లౌకిక పునాదులు ఊడబెరుకడం
గాలిలొ పేకమేడలే..
నీటి మీద రాతలే..
అన్ని రోజులు అందలం అసాధ్యం
అందిన కాడికి దందుకునుడు
ఏదో రోజు జైలుకు వెళ్ళడం తధ్యం.
మనిషిని మనిషిగా
మార్చే పవనాలు వీచెలా
మానవత కుసుమాలు
భరత వక్షానికి పూసెలా
ఆ వైపుగా సట్టాలు చేసేలా
ఉండాలి మీ ఆలోచనలు…
అప్పుడే సమ్మిట్ లకు అర్దం..పరమార్థం.
– నాగరాజు మద్దెల, 6301993211