ఎడ్ల కట్ట వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభం..

నవతెలంగాణ-భిక్కనూర్
రిలయన్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో మండలంలోని తిప్పాపూర్ గ్రామ శివారులో ఎడ్ల కట్ట  వాగు పై నిర్మించిన చెక్ డ్యామ్ ను సర్పంచ్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ రిసోర్స్ పర్సన్ రంజిత్ మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు టమాటా మిర్చి వంకాయ ఆకుకూరలలో కత్తెర పురుగు నివారణ, మొక్కజొన్న లో పొడవైన ముళ్ళ గడ్డి మొక్కల నివారణ చర్యలు గురించి, వరి పొలంలో అధిక దిగుబడి కొరకు పాటించాల్సిన పద్ధతుల గురించి రైతులకు వివరించారు. రైతులు అందరూ సేంద్రియ ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయం వైపు ముగ్గు చూపాలని దానితో రైతులు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మంద నాగరాజు, మల్లేష్, ఫెసిలిటేటర్ భూపతి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Spread the love