
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల ఎఫ్ పి ఓ రైతు సంఘం ద్వారా వానాకాలం పంట సాగు కోసం సోయా విత్తనాలు బాసరరకం 8 కిలోల బ్యాగులను అమ్మకాన్ని గురువారం నాడు ఎఫ్ పి ఓ సంఘం చైర్మన్ చాట్ల గోపాల్ మండల వ్యవసాయ అధికారి రాజు ఎఫ్ పి ఓ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ ఏడాది కొత్తరకం సోయా విత్తనాలు 8 కిలోల బ్యాగులు రావడం అవసరం గల రైతులు సరైన ధరలతో తీసుకు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని వానాకాలం పంట సాగులో భాగంగా రైతులు బాసర రకం విత్తనాలు సాగు కోసం తీసుకువెళ్లాలని సంఘం చైర్మన్ మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.