అచ్చంపేటలో వేసవి సంగీత, నృత్య శిక్షణ శిబిరం ప్రారంభం

నవతెలంగాణ – అచ్చంపేట 
స్వర్ణభారతి కళానిలయం కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో  పట్టణంలోని స్థానిక న్యూ ఎక్సీడ్ ఉన్నత పాఠశాలలో ఆదివారం వేసవి సంగీత నృత్య శిక్షణ శిబిరంను ఆ పాఠశాల కరస్పాండెంట్ కపిలవాయి చంద్రమోహన్, సీనియర్ కళాకారుడు టి. రఘుపతి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 17 సంవత్సరాల కళా అనుభవం కలిగిన స్వర్ణభారతి కళానిలయం  కల్వకుర్తి,  పట్టణంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని,  చిన్నారులు వేసవి సెలవులు వృధా చేయకుండా ఈ శిబిరంలో చేరి కళను నేర్చుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతత వీటి ద్వారా కలుగుతాయన్నారు. చదువుతో పాటు ఇలాంటి కళల్లో ఆరి తేరాలని శిబిరంలో ఎక్కువ మంది పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు  నారోజు మోహన్ మాట్లాడుతూ… 30 రోజుల పాటు కొనసాగే ఈశిబిరంలో కూచిపూడి నృత్యం, జానపద నృత్యం, పాశ్చాత్య నృత్యాలతో పాటు లలిత సంగీతం, సంగీత వాయిద్యాలలో శిక్షగానిచ్చి శిబిరం చివరి రోజున ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి నరేషాచారి, నృత్య గురువు అంజి, కళ్యాణ్, చిన్నారులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Spread the love