ముగిసిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌

– సప్లిమెంటరీ పరీక్షలు
– జులై మొదటివారంలో ఫలితాలు విడుదల
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ త్సరం విద్యార్థులకు నిర్వహించిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈనెల 12 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ సంవత్స రం పరీక్షలు ఉదయం తొమ్మిది నుం చి మధ్యాహ్నం 12 గంటల వర కు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 2,70,583 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 1,41,742 మంది కలిపి మొత్తం 4,12,325 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కూడా మంగళవారం నుంచి ప్రారంభమైంది. వచ్చేనెల మొదటివారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

 

Spread the love