రేపటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

– 71,681 మంది విద్యార్థుల హాజరు
– 259 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. అబ్బాయిలు 41,526 మంది, అమ్మాయిలు 30,155 మంది కలిపి 71,681 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం 259 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 259 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను, 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా ఉండేందుకు 50 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నిjమించామని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోని చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకు రావొద్దని విద్యార్థులను కోరారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్‌ రూం (040-23230942)ను ఏర్పాటు చేశామని తెలిపారు. హాల్‌టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్ల ద్వారా వాటిని తీసుకోవాలని సూచిం చారు. షషష. bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ లోనూ హాల్‌టికెట్లను పొందుపరిచామని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశామని తెలిపారు.

Spread the love