శాట్స్‌ చైర్మెన్‌ అభినందన

తెలంగాణ సైక్లింగ్‌ క్రీడాకారుడు అన్నాడి మధుసూదన్‌ రెడ్డి ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో ఆల్‌ ఇండియా 51వ ర్యాంక్‌ సాధించి సిఆర్‌పిఎఫ్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఎంపికయ్యాడు. ఓ వైపు సైక్లిస్ట్‌గా వివిధ టోర్నీల్లో పోటీపడుతూనే, మరోవైపు ఉద్యోగ సాధనలో విజయం సాధించిన మధుసూదన్‌ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అభినందించారు.

Spread the love