సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక పూజలు

నవతెలంగాణ మద్నూర్: ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం జుక్కల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మి కాంతారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మద్నూర్ మండలంలోని కెలూరు సలబత్పూర్ చిన్న షక్కర్గా పెద్ద షక్కర్గా సోనాల తడి ఇప్పర్గా గోజేగావ్ ఆవలగావ్ తదితర గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రామ్ పటేల్ సీనియర్ నాయకులు మేనూర్ గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love