గద్దర్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష 

Congress government discrimination against Gaddar family– తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ 
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్ 
పేద ప్రజల గొంతుకై నిలిచిన గద్దర్ పై…కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎక్కడ లేని ప్రేమ ఓలకబోసి కూతురు కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందని, బై ఎలక్షన్ లో మాత్రం వలస నాయకులను తెచ్చుకుని గద్దర్ కుటుంబం పై కపట నాటక మాడిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. గద్దర్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ  జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి గద్దర్ చిత్రపటానికి  కిషోర్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలను చూసి గద్దర్ ఆత్మ కూడా క్షోబిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, చీర పంకజ్ యాదవ్,మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి, జిల్లాగ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కాంచనపల్లి రవీందర్ రావు,న్యాయవాది గోకికర్ జవహర్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,సింగం లక్ష్మీ, తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు, జమాల్ ఖాద్రి, కొండూరి సత్యనారాయణ, రంజిత్, గుండ్రేడ్డి యుగంధర్ రెడ్డి ..విద్యార్థి నాయకులు బొమ్మర బోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Spread the love