ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ -బూర్గంపాడు
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, కేసీఆర్‌ దెబ్బకు ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం మండలంలోని మోరంపల్లి బంజర్‌ సీనియర్‌ నాయకులు మేడం లక్ష్మీనారాయణరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ అమలుకాని హామీలను ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులకు గుణ పాఠం చెప్పేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రను చేపట్టి కాంగ్రెస్‌ కుయుక్తులను బయట పెట్టగా బెంబేలెత్తిన ప్రభుత్వం వెంటనే రైతు బంధు జమచేసిందన్నారు. ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వానికి రైతులు, ప్రజలు కోపంతో రగిలిపోతున్నారని తెలుసుకుని కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారని ఆయన అన్నారు. తాము చేసిన మోసం ఎంతోకాలం నిలవదని కాంగ్రెస్‌ నాయకులు గ్రహిం చారన్నారు. కాంగ్రెస్పై కోపంతో ఉన్న రైతులు, ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధులకు అత్యధిక మెజార్టీ ఇచ్చేలా ముందుకు -సాగుతున్నా రన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూ బాబాద్‌, ఖమ్మం ఎంపీ అభ్యర్థులు మాలోతు కవిత, నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమైందని ఆయన పేర్కొన్నారు
సమస్యలపై ప్రశ్నించే కవితను మరోమారు గెలిపించండి : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌
ప్రజాసమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో గొంతెత్తి ప్రశ్నించే ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను మరోమారు ఆశీర్వదించి గెలిపించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పార్లమెంట్లో ప్రజాసమస్యల పరి ష్కారం కోసం కవిత కషిచేస్తుందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పినపాక నియోజకవ ర్గానికి అధిక నిధులు మంజూరు చేశామని, ప్రధానంగా పోడు సమస్యలతో బాధపడుతున్న పోడురైతులకు బీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోడు పట్టాలివ్వగా అత్యధికం గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు రైతులకే వీటిని ఇవ్వడం జరిగిందన్నారు.
బీఆర్‌ఎస్‌ అభివద్ధే తనను గెలిపిస్తుంది : బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సారధ్యంలో మహబూబాబాద్‌ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసు కువచ్చి అభివద్ధి చేశానని, మరోమారు తనను గెలిపించినట్లయితే మరిన్ని నిధులు తీసుకువచ్చి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అభివద్ధిలో ముందుంచుతానని ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పార్లమెంట్లో వినిపించి సమస్యల పరిష్కారానికి కషిచేస్తానని, కార్యకర్తలు, నేతలు తన గెలుపు కోసం కషిచేసి మరోమారు ఆశీర్వదించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ తోటమళ్ల సరిత, గ్రామశాఖ అధ్యక్షుడు ఖగేందర్రెడ్డి, మండల నాయకులు పొడియం నరేందర్‌ పాల్గొన్నారు.

Spread the love