రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం..

– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో
– రేవంత్ రెడ్డి మాటలు వక్రీకరిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ -తాడ్వాయి
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ  ధ్యేయంమని మండల అధ్యక్షుడు బోల్లు దేవేందర్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి  రైతుల ఉచిత విద్యుత్ గురించి చేసిన వ్యాఖ్యలపై వక్రీకరించి మట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిరసన తెలుపుతూ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతుల ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించి మట్లుడుతున్న బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు తీరుకు మండల కేంద్రము లో ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్నాం. అని అన్నారు.24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్తూ రైతులను మోసం చేస్తుందని ఒక ఎకరానికి గంట విద్యుత్ సరిపోతుంది. అని ఆ లెక్కన రాష్ట్రంలో ఎనిమిది గంటలకు విద్యుత్ సరిపోతుందని 24 గంటల్లో ఉచిత విద్యుత్ రాష్ట్ర ఖజానాను దుర్వినియోగం చేస్తూ,ప్రజలపై భారాన్ని మోపుతుందని మాట్లాడిన వాక్యాలను కావాలని దుర్బాషలడుతన్నరని అన్నారు. రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులకు పంట రుణాలు మాఫీ చేసిందీ కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ రైతులకు  ఎం చేసిందో రైతాంగానికి తెలుసు అని అన్నారు. కండ్లు లేని కబొదులుగా మాట్లుడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలని రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీనీ ఇచ్చినకాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండి ముజఫర్, సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య,స్థానిక సర్పంచ్ ఇర్ఫ సునీల్ దొర, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరు శ్రీనివాస్,  కిసాన్ సెల్ మండల అధ్యక్షులు భూషణ బోయిన రవికుమార్, బీసీ సెల్ మండల అధ్యక్షులు యాషాడపు మల్లయ్య, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరిల వెంకన్న, జిల్లా సీనియర్ నాయకులు తాండాల శ్రీను, నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, మాజీ ఎంపీటీసీ మోహన్ రావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు రమేష్ యాదవ్, యానాల సిద్ది రెడ్డి, జగదీష్, నాయకులు పురుషోత్తం నారాయణ, పాక రాజేందర్, మర్రి నరేష్, పాలకుర్తి రవీందర్, శనిగరపు చిరంజీవి, కృష్ణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love