– వికారాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలే పార్టీ అభ్యర్థులు?
– బీఆర్‌ఎస్ సీట్లు సిట్టింగ్‌లకే కేటాయింపు
– కాంగ్రెస్ తాండూర్ టికెట్ ఎవరికో..
– బలమైన నేతను దింపేందుకు అధిష్టానం దృష్టి
దరఖాస్తు చేసుకున్న పలువురు నేతలు
బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించడంతో వీరి ప్రత్యర్థులు ఎవరు అనేది స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులపైనే ఇప్పుడు దృష్టి మళ్లీంది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు టికెట్లు ఆశిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు ఇంకా సమయం ఉండడంతో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అనే దానికి ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవ ర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు తేలిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్‌పై పడింది. వికారాబాద్ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పరిగి నుంచి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కానీ తాండూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని తేల లేదు. తాండూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చే సేందుకు రోజురోజుకూ ఆశావాహులు పెరిగిపోతు న్నారు. ఈ సారి ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్లుగా కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం కూడా వేచిచూసే దోరణిని ప్రదర్శించింది. మొదటి నుంచి తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌మహరాజ్ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే మహరాజ్‌లకు కంచుకోటగా పేరుంది.
ఇదిలా ఉంటే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ధారూర్ ప్రాంతానికి చెందిన రఘురారెడ్డి తాండూర్ టికెట్ తమకు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి దీటుగా బలమైన నేతను దింపాలని ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అధిష్టానం బుజ్జగింపుతో కాంగ్రెస్‌లో చేరే నిర్ణ యం మానుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఒక్కసారి గా పరిణామాలు మారిపోయాయి. తాం డూరు అసెంబ్లీ స్థానం నుంచి రమేష్ మహరాజ్‌తో పాటు సంఖ్య పెరిగింది. తాండూరు నుంచి తనకు టికెట్టు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుప తిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, మరో ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డితో పా టు మాజీ క్రికెటర్ అజారోద్దీన్‌లు పోటీ పడుతు న్నారు. పార్టీ టికెట్టు కోసం పార్టీలో దరఖాస్తు చేసుకు న్నారు. ఈ పరిణామాల మద్య తాండూరు నియో జకవర్గ టికెట్టు ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి.