ఫామ్‌ హౌజ్‌ను సీజ్‌ చేయాలి : కాంగ్రెస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో ఏర్పాటు చేసిన వార్‌ రూమ్‌ను తక్షణమే తనిఖీ చేసి, దాన్ని సీజ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు తమ్మేటి సమ్మిరెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులు, నాయకులపై లోతుగా విచారించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమానితులు, అరెస్ట్‌ అయిన వారి ఆస్తుల చిట్టా తీయాలనీ, వారు దోచుకున్న ఆస్తులు, బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love